: శాకాహారమే మంచిదంటూ సాగరకన్యగా దర్శనమిచ్చిన ముద్దుగుమ్మ
శాకాహారం తీసుకోవడమే ఆరోగ్యానికి మేలని ‘పెటా’ అనే స్వచ్చంధ సంస్థ హైదరాబాదులో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి ఆదా శర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యింది. శాకాహార ప్రాముఖ్యాన్ని తెలియజేసే పోస్టర్ ను ఆదా శర్మ ఆవిష్కరించింది. ఈ పోస్టర్లో సాగరకన్యగా కనిపించింది. మాంసాహారం వద్దంటూ... శాకాహారమే తీసుకోవాలని ఈ ముద్దుగుమ్మ చెప్పకనే చెప్పింది.