: గుంటూరు, విజయవాడ కంటే దొనకొండ బాగుంటుంది: వైవీ సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి గుంటూరు, విజయవాడ కంటే దొనకొండ ప్రాంతం బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీకి సూచించామని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీని ఢిల్లీలో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొనకొండ ప్రాంతం అటు కోస్తాకు, రాయలసీమకు మధ్యన ఉంటుందని అన్నారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే వెనుకబడిన ప్రాంతాలను రాజధానిగా నిర్మిస్తే అక్కడి ప్రజలంతా అభివృద్ధి చెందుతారని సూచించామని ఆయన పేర్కొన్నారు. తమ సూచనపై రాజధాని కమిటీ సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు.