: ఇరు రాష్ట్రాలు సహకరించుకోకపోతే అడ్మిషన్లు కష్టం: ఉన్నత విద్యామండలి ఛైర్మన్
ఎంసెట్ కౌన్సెలింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సహకరించుకోకపోతే అడ్మిషన్లు కష్టమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణు గోపాల్ రెడ్డి అన్నారు. ఆలస్యం కావడంవల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, ఈ నేపథ్యంలో ఇక్కడి విద్యాసంస్థలను, విద్యార్థులను కాపాడుకోవల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనివల్ల కొంతమంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశామని ఆయన తెలిపారు.