: ఫీజు రీయింబర్స్ మెంట్ పై చంద్రబాబు కొత్త ప్రపోజల్
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అవగాహనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అయ్యే ఖర్చులో 58శాతం భారం భరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన 42 శాతం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ప్రతిపాదనలతో పాటు కొన్ని ప్రశ్నలను కూడా చంద్రబాబు కేసీఆర్ కు సంధించారు. 1956 స్థానికతకు ఆధారాలేంటో చూపించాలని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏ తహసీల్దార్ దగ్గర వివరాలున్నాయో చెప్పాలని ఆయన కేసీఆర్ ను నిలదీశారు. ఉద్యమ సమయంలో తెలంగాణలోని సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కల్లబొల్లి కబుర్లు చెప్పి... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కర్కశంగా ప్రవర్తిస్తున్నారని ఆయన కేసీఆర్ ను దుయ్యబట్టారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని... విద్యార్థుల భవిష్యత్తు కోసం కలసి కూర్చుని మాట్లాడుకుందామని టీఎస్ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు సూచించారు.