: అర్హులకే రేషన్ కార్డులు: కేసీఆర్
ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ తప్పుల తడకని... అందువల్లే భూదోపిడీలు, కుంభకోణాలు జరిగాయని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ హైటెక్స్ లో సమగ్ర కుటుంబ సర్వే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేలు సమగ్రంగా ఉంటేనే సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 84 లక్షల కుటుంబాలు ఉంటే... 91 లక్షల తెల్ల కార్డులు మంజూరు చేశారని అన్నారు. అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలి కాని... అనర్హులకు కాదని స్పష్టం చేశారు.