: పదవి చేపట్టి 24 గంటలు కూడా కాలేదు... అప్పుడే పాకిస్థాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు
ఇండియన్ ఆర్మీ చీఫ్ గా పదవి చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే పాకిస్థాన్ కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్. పద్దతి మార్చుకోవాలని పాక్ ఆర్మీకి గట్టిగా సూచించారు. సైనికులపై దాడులు చేయడం, తలలు తీయడం లాంటి చర్యలు పునరావృతమైతే... మీకంటే వేగంగా, ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. 26వ ఆర్మీ చీఫ్ గా సుహాగ్ నిన్న బాధ్యతలు చేపట్టారు.