: ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టుకు ఇషాంత్ దూరం
టీమిండియాకు ఎదురుదెబ్బ. మూలిగే నక్కపై తాటిపండులా... ఇప్పటికే సౌతాంప్టన్ టెస్టులో భంగపడిన భారత జట్టుకు ఇషాంత్ నాలుగో టెస్టుకు దూరం కావడం నిజంగా చేదు వార్తే. ఇషాంత్ ఇంకా మడమ గాయం నుంచి కోలుకోలేదని కెప్టెన్ ధోనీ మీడియాతో చెప్పాడు. ఓల్డ్ ట్రాఫర్డ్ మ్యాచ్ కు అతను ఫిట్ నెస్ సాధించలేడన్న విషయం రూఢీ అయిందని, ఈ విషయంపై చర్చించాల్సి ఉందని తెలిపాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఇషాంత్ ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేయడం తెలిసిందే. అయితే, గాయం కారణంగా మూడో టెస్టుకు దూరం కాగా, అతని స్థానంలో జట్టులోకొచ్చిన రాజస్థాన్ పేసర్ పంకజ్ సింగ్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టులో ధోనీ ఎవరిని బరిలో దింపుతాడన్న విషయం ఆసక్తికరంగా మారింది.