: మహమ్మద్ అలీ గ్లోవ్సా... మజాకా..!
మహమ్మద్ అలీ... బాక్సింగ్ రింగ్ లో అరివీరభయంకరుడిగా పేరుగాంచిన ఈ అమెరికన్ యోధుడి గురించి తెలియనివారుండరు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి జో ఫ్రేజర్ తో ఆయన బౌట్లు అభిమానులను ఎంతో అలరించాయి, అటు, బాక్సింగ్ సంఘాలకు కాసుల వర్షం కురిపించాయి. అలీపై అభిమానుల్లో ఇంకా క్రేజ్ తగ్గలేదనడానికి నిదర్శనంలా... ఆయన 1971లో ఫ్రేజర్ తో పోటీపడినప్పటి గ్లోవ్స్ ను తాజాగా వేలం వేయగా రూ.2 కోట్ల 36 లక్షల ధర పలికాయట. అమెరికాలోని క్లీవ్ లాండ్ లో హెరిటేజ్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలం నిర్వహించింది.