: మెట్రోరైల్ రూటులో మార్పులేదు... టీఎస్ సీఎం Vs. ఎల్ అండ్ టి మెట్రోరైల్ ఎండీ


"మెట్రోరైలుతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లడానికి వీల్లేదు. అసెంబ్లీ ముందు కచ్చితంగా మెట్రో కారిడార్‌ రూటు మార్చాల్సిందే. భూగర్భ మార్గం లేదా మరే ఇతర మార్గం గుండా మెట్రో రైలు కారిడార్‌ నిర్మించి హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడాల్ని పరిరక్షించాల్సిందే. మెట్రో రైల్ అలైన్ మెంట్ ను మార్చాల్సిందేనని ఎల్ అండ్ టి సంస్థకు కూడా స్పష్టం చేశాం". మెట్రో రైల్ రూట్ మార్పుపై వివిధ సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర సీఎం సీరియస్ గా చేసిన వ్యాఖ్యలతో మెట్రోరైల్ అలైన్ మెంట్ కచ్చితంగా మారుతుందని అందరూ అనుకున్నారు. అయితే హైదరాబాద్ 'మెట్రో రైల్ స్టోరీ'కి ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ వివేక్ బి గాడ్గిల్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్పు విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అసలు మెట్రోరైల్ మార్పులకు సంబంధించిన అంశాలేవి తమ దగ్గరకు రాలేదని ఆయన అన్నారు. ఇప్పటివరకు మెట్రోలైన్ రూట్ మార్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ... హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలుగానీ, సమాచారం గానీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ మెట్రో రైల్ ఎండీ చెప్పడంతో...తెలంగాణ ప్రభుత్వ వర్గాలు అయోమయంలో పడ్డాయి. కేసీఆర్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ వ్యాఖ్యానించడంతో ఈ విషయంపై అందరిలో అయోమయం నెలకొంది.

  • Loading...

More Telugu News