: ఆందోళన తీవ్రతరం చేసిన తెలంగాణ న్యాయవాదులు


తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ హైకోర్టు సాధన డిమాండ్‌తో హైకోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆందోళన చేపట్టింది. న్యాయవాదుల జేఏసీ ఇచ్చిన చలో హైకోర్టు పిలుపుతో భారీగా తరలి వచ్చిన తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడంతో, తెలంగాణ న్యాయవాదుల సంఘం నేడు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. సంఘం పిలుకు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు నేడు తమ విధులకు దూరంగా ఉంటున్నారు.

  • Loading...

More Telugu News