: 835 అడుగులకు చేరిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 93,624 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 835 అడుగులకు చేరుకుంది. 32,825 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కుడి, ఎడమ గట్ల కేంద్రాల్లోని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.