: తెలంగాణ ఎంఎస్ఓలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం రెఢీ


తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్ఓలపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తనను కలిసిన కొంతమంది పార్లమెంట్ సభ్యులకు ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. వచ్చే మంగళవారం ఈ విషయాన్ని రాజ్యసభలో చర్చించేందుకు సభావ్యవహారాల కమిటీ అంగీకరించింది. ఛానల్స్ నిషేధం, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగడం తదితర అంశాలపై రాబోయే మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుందని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి ప్రకటించారు. వచ్చే మంగళవారం ఈ అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు... చర్చకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణ ఎంఎస్ఓలపై తీసుకునే చర్యలను ప్రకటించవచ్చని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News