: బాహుబలిలో ఒక్క షాట్ అయినా ఇవ్వండి... నటిస్తా!: రాజమౌళిని కోరిన సూర్య
‘బాహుబలి’లో ఒక్క షాట్ లో నటించే అవకాశం ఇస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రముఖ దర్శకుడు రాజమౌళిని కోరారు. గతంలో రాజమౌళి సినిమాను మిస్సయ్యానని, అయితే ఈసారి అలాంటి తప్పిదం జరగదని సూర్య వివరణ ఇచ్చారు. 'మీకు అవకాశం ఉంటే మరోసారి నాకు అవకాశం ఇవ్వాల'ని ఆయన రాజమౌళిని కోరారు. సూర్య మాట్లాడినప్పుడు రాజమౌళి నవ్వుతూ ఆయన వ్యాఖ్యలు స్వాగతించారు.