: కబడ్డీ పండుగకు అమితాబ్, సచిన్, అమీర్, షారూఖ్!


నూట ఇరవై కోట్ల భారతావనిలో క్రికెట్ కు తప్ప ఇతర క్రీడలకు అంత ఆదరణ లభించడం లేదు. ఆటాడితే ఏమొస్తుందిలే అనే తల్లిదండ్రులు కూడా, ఆటలాడితే మంచి ఉద్యోగాలు, పేరు ప్రఖ్యాతులు, కోరినంత డబ్బు వస్తుందని ఇప్పుడు గుర్తిస్తున్నారు. మరోవైపు సినిమాల తరువాత అత్యధికంగా వ్యాపారం చేసేది ఆటలేనని వ్యాపార వేత్తలు గుర్తించారు. అందుకు సేవకు సేవ, వ్యాపారానికి వ్యాపారం ఉండేలా క్రీడల ప్రాచుర్యానికి నడుం బిగిస్తున్నారు. తాజాగా మన రాష్ట్ర క్రీడ కబడ్డీకి ప్రాచుర్యం కల్పించేందుకు సల్మాన్ ఖాన్ నడుం బిగించాడు. బాలీవుడ్ మాస్ మహరాజా సల్మాన్ కబడ్డీ ప్రోమోల్లో నటించి ఆదరణ కల్పించాడు. కాగా ఐపీఎల్ తరహాలో ప్రో కబడ్డీ లీగ్ అని 8 జట్లతో ఓ లీగ్ ప్రారంభమైంది. దీని ప్రారంభోత్సవానికి బాలీవుడ్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, జయబాదురి, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరై సందడి చేశారు. ఈ టోర్నీలో ఢిల్లీ, ముంబై, జైపూర్, పాట్నా, పూణే, కోల్ కతా, బెంగళూరు, వైజాగ్ జట్లు పోటీ పడుతున్నాయి. జైపూర్ పింక్ పాంధర్స్ జట్టును అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేయడంతో బాలీవుడ్ సినీనటులంతా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News