: మానవ వనరుల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మానవ వనరుల శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. గడచిన పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వం దగా చేసిందని బాబు అన్నారు. గత దశాబ్ద కాలంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారనీ... ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో డ్రాపవుట్ రేట్లు పెరిగిపోయాయనీ అన్నారు. మాతా శిశుమరణాలలోనూ చాలా దారుణమైన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో శిశుమరణాలు పెరిగిపోయాయని ఆయన చెప్పారు. ఐటీడీఏ ను నిర్వీర్యం చేశారన్నారు. 2003 - 2006 మధ్య కాలంలో విద్యార్థుల శాతం 76 శాతం ఉంటే.. ఇప్పుడది 50 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు. విద్యాశాఖలో అనేక కుంభకోణాలు జరిగాయని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు 123 శాతం పెరిగారని ఆయన చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ పాలనలో ప్రాథమిక విద్య మొదలుకొని... ఉన్నత విద్య వరకు అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలి... ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. అందుకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

  • Loading...

More Telugu News