: ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
ఆర్టీసీ కార్మిక నేతలతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండు రోజులుగా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దీక్షలు చేయడంతో... ఇవాళ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) నేతలను చర్చలకు రావాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆహ్వానించింది. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని బస్ భవన్ లో జరిగిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగించాలని కార్మిక నేతలు నిర్ణయించారు. సొసైటీకి రూ.250 కోట్లు యాజమాన్యం బాకీ పడింది. అయితే, ఆ సొమ్మును చెల్లించలేమని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. దాంతో, సమావేశం మధ్యలో నుంచి ఈయూ నేతలు బయటకు వచ్చేశారు. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మె చేయనున్నట్లు వారు ప్రకటించారు.