: భారత్ ఓటమి ఖాయమైంది... రోహిత్, ధోనీ ఔట్


సౌతాంప్టన్ టెస్టులో భారత్ ఓటమి ఖాయమైంది. ఏదైనా అసాధారణ ఇన్నింగ్సో, వరుణుడో తప్ప మ్యాచ్ ను భారత్ చేజారకుండా మరెవ్వరూ అడ్డుకోలేరు. ఆటకు చివరిరోజున రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆండర్సన్ కోలుకోలేని షాకిచ్చాడు. వెంటవెంటనే రోహిత్ శర్మ (6), ధోనీ (6)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో, భారత్ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అనంతరం పార్ట్ టైం స్పిన్నర్ మొయిన్ అలీ.. జడేజా (15), భువనేశ్వర్ (0)లను ఔట్ చేసి భారత్ ను ఓటమికి చేరువలో నిలిపాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 8 వికెట్లకు 152 పరుగులు కాగా క్రీజులో రహానే (35*), షమి (0*) ఉన్నారు.

  • Loading...

More Telugu News