: శృంగార సామర్థ్యం పెంచేది మనరాష్ట్రంలోనే విరివిగా లభిస్తోంది...అందుకే అది ఖరీదు!
‘పొరుగింటి పుల్ల కూర రుచి’... ఈ సంగతి భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇంపోర్టెడ్ వస్తువులతో పాటు, ఇంపోర్టెడ్ సంస్కృతి, సంప్రదాయం, ఆలోచనలు, బంధాలు... ఇలా అన్నీ ధనికంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకే పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న అనేక అంశాలు భారతీయుల కంటే విదేశీయులకే బాగా అర్థమవుతున్నాయి. అందుకే మనకి అక్కరకు రాని ఆయుర్వేదం, నేచురోపతి వంటి వైద్యవిధానాలు విదేశీయులు అనుసరిస్తుండగా ఇంపోర్ట్ చేసుకున్న ఇంగ్లిష్ మందులను మనం వాడుతూ ఆసుపత్రులకు వేలకు వేలు వెచ్చిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, శృంగార ఔషధం మనదేశంలో... అందునా మనరాష్ట్రంలో విరివిగా లభిస్తుందని ఎంత మందికి తెలుసు? దానిని స్మగ్లింగ్ చేసే వారికి కూడా అందులో ఔషధ గుణాలున్నాయని తెలిసి ఉండకపోవచ్చు. ఇండియాలో దొరుకుతోంది... దానికి విదేశాల్లో గిరాకీ ఉంది. అందుకే దానిని స్మగ్లింగ్ చేస్తున్నారు, అదీ విశేషం. కాకపోతే ఎర్రచందనం గుణగణాలు తెలిసిన చైనా, జపాన్ వంటి దేశాల వారు ఎంత ఖర్చు చేసైనా ఎర్రచందనం కొని, వాడటానికి వెనుకాడడం లేదు. ఎర్ర చందనానికి ఔషధ గుణాలతో పాటు శృంగార సామర్థ్యం పెంచే శక్తి కూడా ఉంది. ఎర్రచందనం పౌడర్ రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో కానీ, తేనెలో కానీ కలుపుకుని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకుంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరిగి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చైనా, జపాన్ లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం ఉండాల్సిందే. పెళ్లి చేసుకునే యువకుడు పెళ్లికుమార్తెకు షామిచాన్ అనే వాయిద్యాన్ని విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాయిద్యం ఎర్రచందనంతో తయారవుతుంది. దీని తయారీకి తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇందు కోసం చైనా, జపాన్ లో ఏటా 8లక్షల టన్నుల ఎర్రచందనం మన దేశం (రాష్ట్రం) నుంచి అడ్డదారుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. ఎర్రచందనానికి అంత డిమాండ్ ఉండబట్టే ఎర్రచందనం స్మగ్లర్లు కోట్లకి పడగలెత్తుతున్నారు.