: భారతదేశానికి ఆ ఇద్దరే విలన్లు!


భారతదేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఇద్దరే విలన్లుగా మారారు. భారత ప్రధానులు మారినప్పుడల్లా ఆ ఇద్దరూ హడావుడి చేస్తారు. మారినట్టు నటిస్తారు, కానీ, వాటిని నిశితంగా పరిశీలిస్తే వారేం మారలేదన్న వాస్తవం తెలుస్తుంది. ఆ ఇద్దరూ... ఒకటి చైనా అయితే, రెండోది పాకిస్థాన్! భారత సరిహద్దుల్లో అవకాశం చిక్కినప్పుడల్లా చైనా చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇక, పాకిస్థాన్ భారతదేశ సహనాన్ని పరీక్షిస్తోంది. భారత్ శాంతివచనాలు పలుకుతోంటే... పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. మన సైనికులను పాక్ హతమారుస్తోంది. మన్మోహన్ హయాంలోనే కాదు... మోడీ ప్రధాని అయ్యాక కూడా పాక్ ఆగడాలు ఆగలేదు. జమ్మూలో భారత్ సైనికుల తలలు నరికినప్పుడు మోడీ ఆవేశంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు ఆ ఆవేశం ఏమైంది? చైనా భారత భూభాగంలోకి ప్రవేశిస్తుంటే మోడీ ఏం చేస్తున్నారు? మోడీ చైనా దేశాధ్యక్షుడితో సమావేశమై శాంతి చర్చలు సాగిస్తున్న సమయంలో... జులై 13వ తేదీన ఒకసారి, 15న మరోసారి చైనా భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి భారత సైనికులపై దాడులకు తెగబడింది. ఓ వైపు భారత్ కు స్నేహహస్తం అందిస్తున్నట్లు నటిస్తూనే.. చైనా మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రధానిగా మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించి... చైనాకు షాకిచ్చారు. భారత్ చైనాకు దీటైన జవాబు ఇవ్వగలదని సంకేతాలను పంపారు. అలాగే, ఆ సమయంలో పాక్ ప్రధానితో సమావేశమైన మోడీ తన అభిప్రాయాలను సుస్పష్టం చేశారు. పాక్ కు స్నేహహస్తం అందిస్తూనే... పాకిస్థాన్ ఆగడాలను ఉపేక్షించేది లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు.

  • Loading...

More Telugu News