: మేఘమథనం పేరుతో కోట్లు దండుకున్నారు: చంద్రబాబు
రైతులు కరవును ఎదుర్కొనే విధంగా పలు కార్యక్రమాలను చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భూసార పరీక్షలు చేయించడంలో గత ప్రభుత్వం విఫలమయిందని... మేఘమథనం పేరుతో కోట్ల రూపాయలను దండుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయని అన్నారు. నీటి సంరక్షణకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంచుతామని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల లాభాలను కూడా రెట్టింపు చేస్తామని తెలిపారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గి ఉత్పాదకత పడిపోయిందని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.