: హైదరాబాదులో భారీ వర్షం


హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, పంజాగుట్ట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చిన్నపాటి ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి... రహదారులు గోదారిని తలపిస్తున్నాయి. వర్షానికి గాలి తోడవడంతో మాసాబ్ ట్యాంకులో రెండు చెట్లు కూలిపోయాయి. దాంతో ఒక కారు, రెండు బైక్ లు ధ్వంసమయ్యాయి. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు చాలాసేపు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి చెట్లను తొలగించడంతో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News