: ఆ విషయంలో ఆక్టోపస్ కు సాటి మరేది!


భూభాగంలో ఉండే జంతుజాలంతో పోల్చితే... సముద్రజీవుల్లో అపార వైవిధ్యం ఉంటుంది. చిత్రవిచిత్రమైన ప్రాణులు, వివిధ వర్ణాల్లో కనిపించే చేపలు, అతి భారీ తిమింగలాల సహా కొన్ని రకాల వృక్షజాతులూ సముద్రాల్లో మనుగడ సాగిస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ఆక్టోపస్ కూడా. చేతుల్లా ఉపయోగపడే టెంటకిల్స్ తో ఇది కాసింత అసహ్యంగా కనిపిస్తుంది. ఇది గుడ్లు పెట్టడం ద్వారా సంతానాన్ని పొందుతుంది. అయితే, ఈ విచిత్రజీవి ఆ విషయంలో ఎంతో భిన్నంగా వ్యవహరిస్తుంది. మామూలుగా కోడి తన గుడ్లను ఓ మూడు వారాల పాటు పొదిగి పిల్లలు చేయడం మనకు తెలుసు. కానీ, ఈ ఆక్టోపస్ ఎంతకాలం పొదుగుతుందో తెలిస్తే... ఔరా..! అనాల్సిందే. నాలుగున్నర సంవత్సరాల పాటు తన గుడ్లను అత్యంత జాగ్రత్తగా పొదుగుతుందట. సెంట్రల్ కాలిఫోర్నియాలోని మాంటెరీ బే ఆక్వేరియం రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎంబీఏఆర్ఐ) పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణి ప్రపంచంలో ఇంతలా సుదీర్ఘ కాలం పొదిగే జంతువు మరొకటి లేదని ఎంబీఏఆర్ఐ పరిశోధనలకు నేతృత్వం వహించిన బ్రూస్ రాబిసన్ తెలిపారు.

  • Loading...

More Telugu News