: ఆ లారీ... 150 అడుగుల లోయలో పడిపోయింది
ప్రకాశం జిల్లాలో ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి... 150 అడుగుల లోయలోకి పడిపోయింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో లారీ బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన వెంటనే లారీలో నుంచి మంటలు చెలరేగాయని, లారీ తగులబడిపోతోందంటూ స్థానికులు చెబుతున్నారు. ఆ లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరు ఏమయ్యారోనన్న సమాచారం తెలియలేదు. వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అన్న సమాచారం కూడా తెలియకుండాపోయింది.