: గుండెజబ్బు కథ ఈనాటిది కాదు!


ఈ కాలంలో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎందరో ప్రాణాలు విడుస్తున్నారు. అలా కన్నుమూస్తున్న వారిలో పిల్లలూ ఉంటున్నారు. గుండెజబ్బులకు జన్యులోపాలు, ఆహారపు అలవాట్లు, పొగతాగడం కారణమని పరిశోధకులు ఎప్పుడో తేల్చారు. పూర్వ కాలంతో పోల్చితే నేటి యుగంలోనే ఈ హృద్రోగాలు ఎక్కువయ్యాయి. అయితే, వేల సంవత్సరాల క్రితమే ఈ గుండెజబ్బు ఆనవాళ్ళున్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 53,000 ఏళ్ళ నాటి టైరోలియన్ మానవుడిలోనూ గుండెజబ్బుకు సంబంధించిన జన్యువులను కనుగొన్నారు. ఆల్ప్స్ పర్వతశ్రేణిలో దొరికిన ఈ మంచు మనిషి దేహాన్ని పరిశీలించిన పరిశోధకులు అతడిలో కరోనరీ హార్ట్ డిసీజ్ (సీహెచ్ డీ) సంబంధిత జన్యు క్రమాన్ని గుర్తించారు. ఆ మంచుమనిషి జన్యుపటాన్ని మొత్తం పరిశీలించగా... నేడు గుండెజబ్బులకు కారణమయ్యే సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీ మార్ఫిజమ్స్ (ఎస్ఎన్ పీ) అతడి జన్యువుల్లోనూ ఉన్నాయని తెలిసింది. అంతేగాకుండా, అతని రక్తనాళాలు బిరుసెక్కి దళసరిగా తయారైన విషయాన్ని కూడా గుర్తించారు.

  • Loading...

More Telugu News