: ఇది ఆరంభం మాత్రమే: చంద్రబాబు
గత ప్రభుత్వాలు రైతులను ఎంతో నిర్లక్ష్యం చేశాయని... అందుకే రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం నాశనమైందని ఆరోపించారు. రైతు రుణమాఫీ కేవలం ఆరంభం మాత్రమే అని... రానున్న రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని తెలిపారు. రుణమాఫీ చాలామందికి ఊరటనిచ్చిందని చెప్పారు. పచ్చని కోనసీమలోనే క్రాప్ హాలిడే ప్రకటించారంటే... గత ప్రభుత్వ ఘనతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను నాశనం చేశాయని చెప్పారు. పెట్టుబడుల కంటే ఆదాయం తక్కువగా వస్తోందని అన్నారు. వ్యవసాయంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.