: లారా రికార్డు బీట్ చేసిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెప్టెన్ గా ఉంటూ టెస్టుల్లో అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్లలో ధోనీ ఇప్పుడు ప్రథముడు. ఈ క్రమంలో జార్ఖండ్ డైనమైట్ విండీస్ బ్యాటింగ్ రారాజు బ్రియాన్ లారాను వెనక్కినెట్టాడు. లారా 49 సిక్సులు కొట్టగా, ధోనీ 50 సిక్సులు బాదడం విశేషం. సౌతాంప్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో మొయిన్ అలీ బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రికార్డు ధోనీ వశమైంది. కాగా, ధోనీ, లారా తర్వాతి స్థానాల్లో విండీస్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్ (48), వివియన్ రిచర్డ్స్ (46), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (37) ఉన్నారు.

  • Loading...

More Telugu News