: 'సీఎంగారూ... మీరెంతో అందంగా ఉన్నారు, మమ్మల్ని పెళ్ళి చేసుకోరూ'
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రజల కోసం 'జనతా దర్బార్', 'లెటర్స్ టు సీఎం' కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎవరైనా సహాయం అవసరమైన వాళ్ళు ఆ దర్బార్ కు గానీ, తనకు గానీ లేఖ రాస్తే సత్వరమే సాయం అందించాలన్నది అఖిలేశ్ ఆలోచన. కానీ, విన్నపాల కంటే పొగడ్తలతో కూడిన లేఖలే అధికంగా వస్తున్నాయట. అది కూడా అఖిలేశ్ అందాన్ని కీర్తిస్తూ..! గడచిన రెండేళ్ళలో ఐదు లక్షల ఉత్తరాలు రాగా... అత్యధిక లేఖల సారాంశం "ముఖ్యమంత్రి గారూ! మీరెంతో అందంగా ఉన్నారు, మమ్మల్ని పెళ్ళి చేసుకోరూ..!"అనేనట. కొన్ని లేఖల్లో... "నాకు బొలెరో వాహనం లేదు, నాకోటి కొనిస్తారా..?" అని, మరికొన్ని లేఖల్లో... "మీరు నాకు సోదరుడిలాంటి వారు, రాఖీ కట్టవచ్చా?" అని వున్నాయట. ఇలాంటి లేఖలతో సదరు కార్యక్రమాల ప్రయోజనం దెబ్బతింటోందని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు.