: విశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ఈ ఇంట్లో ఏసీబీ సోదాలు... అరెస్టు
విశాఖ కాలుష్య నియంత్రణ మండలి ఎస్ఈ కోరుకొండ రమేష్ ఇంట్లో ఈ ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రూ.6 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం జిల్లాల్లోని రమేష్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. రమేష్ భార్య పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. 26 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం ఈ క్రమంలో రమేష్ చెందిన శ్రీకాకుళం, పొందూరు, విశాఖలో పది ఇళ్ల స్థలాలు, మూడు అపార్టుమెంట్లు, మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దాంతో, రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.