: నేడు భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక చర్చలు
ప్రస్తుతం భారత్ లో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నేడు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంతో కెర్రీ అధికారిక పర్యటన ప్రారంభమవుతుంది. కెర్రీ తన పర్యటనలో భాగంగా భారత ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తోనూ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలకు ఆయా శాఖలకు చెందిన సీనియర్ ప్రతినిధులు కూడా హాజరవుతారు. ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారత వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ కెర్రీ భేటీ అవుతారు.