: చైనాలో దుమ్మురేపుతున్న అమీర్ ఖాన్ సినిమా
అమీర్ ఖాన్ ప్రతినాయక పాత్రలో నటించిన ధూమ్-3 సినిమా చైనాలోనూ కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. చైనాలో 400 ప్రాంతాల్లో 2000 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదలైంది. చైనాలో అపూర్వ ఆదరణ పొందుతున్న ఈ సినిమా అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్ లో తొమ్మిదో స్థానం సంపాదించడం విశేషం. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సీక్వెల్ టర్కీలోనూ ప్రభంజనం సృష్టించింది. అక్కడి టాప్ టెన్ మూవీ చార్ట్ లో స్థానం సంపాదించిన తొలి భారత సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇక, చైనాలో ఇంత భారీ స్థాయిలో రిలీజైన భారత సినిమా ఇదే. చైనా రొమాంటిక్ మూవీ 'ను జువో నో డై' కూడా ధూమ్-3 ధాటికి వెనకబడిపోయిందట. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఉదయ్ చోప్రా నటించారు.