: జడేజాను వదిలి రహానే వెంటపడ్డాడు!
తొలి టెస్టులో రవీంద్ర జడేజాతో వాగ్వివాదం నెరిపిన ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జిమ్మీ ఆండర్సన్ మరో గొడవతో వార్తల్లోకెక్కాడు. సౌతాంప్టన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో భారత బ్యాట్స్ మన్ అజింక్యా రహానేతో మాటల యుద్ధానికి దిగాడు. ఆండర్సన్ ఏవో కామెంట్లు చేయగా, రహానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దశలో అంపైర్ రాడ్ టకర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాడు. ఇప్పటికే ఓ వివాదంలో ఇరుక్కున్న ఈ ఇంగ్లిష్ పేసర్ కు తాజా గొడవ మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతుందనడంలో సందేహంలేదు.