: ఖాళీ చేస్తే... లూటీ చేశామంటారా?: ఏపీ డీజీపీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్ఐబీ భవనం నుంచి కుర్చీలు, బల్లలు లూటీ చేశారనడం సరికాదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు వ్యాఖ్యానించారు. అద్దె ఇల్లును ఎలా ఖాళీ చేస్తారో... తాము కూడా అలానే ఆ భవనాన్ని ఖాళీ చేశామని ఆయన తెలిపారు. తాము తీసుకెళ్లిన ప్రతీ వస్తువు గురించి తెలంగాణ పోలీస్ అధికారులకు చెప్పామని ఆయన అన్నారు. వాస్తవంగా సదరు భవనాన్ని గవర్నర్ ఏపీ గ్రేహౌండ్స్ కు కేటాయించారని... అయితే తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐబీ భవనం కావాలని తమను కోరడంతో ఖాళీ చేశామని డీజీపీ రాముడు అన్నారు.