: సచిన్ మయమైపోయిన విజయవాడ


విజయవాడ మొత్తం సచిన్ మయమైపోయింది. విజయవాడలో ఏ ఇద్దరు కలుసుకున్నా రేపు రానున్న సచిన్ గురించే సంభాషించుకుంటున్నారు. సచిన్ రాక గురించి విజయవాడ వాసులు ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విజయవాడలో ఎక్కడా చూసినా సచిన్ కు స్వాగతం పలుకుతూ హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ లోని బెంజి సర్కిల్, స్వరాజ్యమైదాన్ లలో ఏర్పాటుచేసిన హోర్డింగులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 'వెల్కం టు విజయవాడ... ఫ్రైడ్ ఆఫ్ ఇండియా', 'వెల్కం లిటిల్ మాస్టర్ టు ది సిటీ ఆఫ్ విక్టరీ' లాంటి కొటేషన్లతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి సచిన్ కు ఘన స్వాగతం పలికేందుకు విజయవాడ వాసులు సిద్ధమయ్యారు. విజయవాడలోని మహాత్మగాంధీ రోడ్ లో 125 కోట్లతో ప్రముఖ తెలుగు సినీ నిర్మాత పిీవీపీ ప్రసాద్ నిర్మించిన పీవీపీ స్క్వేర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడానికి రేపు సచిన్ వస్తున్నాడు. సచిన్ తో పాటు హీరోయిన్ అనుష్క కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది. సచిన్ విచ్చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పీవీపీ సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News