: మూడో టెస్ట్ లో ఓటమి కోరల్లో చిక్కుకున్న ఇండియా
రెండో టెస్టులో అద్భుతవిజయం సాధించిన భారత్... మూడో టెస్ట్ లో ఓటమి కోరల్లో చిక్కుకుంది. మూడో టెస్ట్ లో విజయానికి 445 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. లక్ష్య ఛేదనలో ఇప్పటికే విజయ్ (12), ధవన్ (37), పుజారా (2), కోహ్లీ (28) వికెట్లను భారత్ కోల్పోయింది. భారత్ ఈ మ్యాచ్ లో డ్రాతో గట్టెక్కాలంటే రహానె, రోహిత్ శర్మ, కెప్టెన్ ధోనీలతో పాటు టెయిలెండర్లు కూడా అసాధారణంగా పోరాడాల్సిందే! అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 239 పరుగులు భారీ ఆధిక్యం చేతిలో ఉంచుకుని, భారత్ కు ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్... ఓ ప్రణాళిక ప్రకారం వేగంగా ఆడింది. అలిస్టర్ కుక్ (70 నాటౌట్), రూట్ (56) రాణించడంతో.. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను 205/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.