: నేడు హైకోర్టు విధులను బహిష్కరించనున్న టీఎస్ న్యాయవాదులు
తెలంగాణ న్యాయవాదులు నేడు హైకోర్టు విధులను బహిష్కరిస్తున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో, ఉమ్మడి హైకోర్టును కూడా రెండుగా విభజించాలని... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదులు హైకోర్టుకు తరలివస్తున్నారని టీఎస్ న్యాయవాదుల ఐకాస తెలిపింది. నిరసనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేయాలని నిర్ణయించారు.