: కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు: రావెల కిషోర్ బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ... స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఏపీకి చట్టబద్దంగా వచ్చిన హక్కును ఉల్లంఘిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రజలను హైదరాబాదులో దిగువశ్రేణి పౌరులుగా చిత్రించే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ జీవోపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రావెల తెలిపారు.