: రేపు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య
రేపు విద్యాసంస్థల బంద్ కు బీసీ సంఘం నాయకుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఉస్మానియా విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చిన సందర్భంగా ఆయన రెండు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. విద్యార్థులకు యధావిధిగా ఫీజు రీయింబర్స్ మెంట్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లో అవకతవకలు ఉంటే వాటిని అరికట్టడం చేయకుండా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ఇబ్బందుల్లో పడేసేలా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు. తక్షణం ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తివేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం అమలు జాప్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు అర్ధం చేసుకుని ఫీజు రీయింబర్స్ మెంట్ చేపట్టాలని ఆయన సూచించారు.