: అమెరికా గడ్డపై ‘సిరివెన్నెల అంతరంగా’న్ని ఆవిష్కరించిన సీతారామశాస్త్రి


అమెరికాలో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతరంగాన్ని ఆవిష్కరించారు. మెంఫిన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య వేదిక కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ... తెలుగు పాట పుట్టుక, తెలుగు పాట అవసరం, రామాయణ సారంతో పాటు జగమంత కుటుంబానికి అర్థాన్ని తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పారుపూడి కిరణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘పాడుతా తీయగా’ ఫేం నేమాని పార్థు, ‘సూపర్ సింగర్’ సాహితి తమ మధుర గానంతో సంగీత విభావరిని నిర్వహించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు గోటేటి శ్రీరామ్, డాక్టర్ ఎం.కిశోర్ తదితరులు సిరివెన్నెల దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనికొండ మురళి, బొల్లిముంత దినేష్, రూపేశ్, నరేశ్ వర్మ తదితరులకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.

  • Loading...

More Telugu News