: మరో కొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ఇటీవలే యువతుల కోసం ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... తాజాగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ విద్యార్థుల కోసం ‘అంబేద్కర్ విద్యానిధి’ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద విద్యార్థికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. వార్షికాదాయం రూ.2 లక్షలకు మించని ఎస్సీ కుటుంబాల విద్యార్థులు ఈ పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ‘అంబేద్కర్ విద్యా నిధి’ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్ సర్కార్ విడుదల చేసింది.