: లండన్ రోడ్ల పైకి డ్రైవర్లు లేని కార్లు వచ్చేస్తున్నాయ్!


డ్రైవరు లేని కార్లు ఏమిటని నవ్విపోకండి. వచ్చే జనవరికల్లా లండన్ రహదారుల పైకి డ్రైవర్లు లేని కార్లు రయ్ మని దూసుకొచ్చేస్తున్నాయ్. మామూలు రోడ్లపై ఈ కార్లను పరీక్షించేందుకు యూకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరహా కార్లను పరిశోధించేందుకు గాను బిజినెస్ సెక్రటరీ విన్స్ కేబుల్ 10 మిలియన్ పౌండ్ల నిధులను మంజూరు చేశారు. డ్రైవర్ లేని కార్లపై పరిశోధన చేసే ఔత్సాహికులు అక్టోబరు ఒకటో తేదీలోగా అప్లికేషన్ పెట్టుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు నగరాల్లో 18 నెలల నుంచి 36 నెలల వరకు ఈ తరహా కార్లను పరిశోధించి... పరిశీలించి... పరీక్షిస్తారు. లండన్ చరిత్రలోనే ఈ చోదక రహిత వాహనాలు పెనువిప్లవాన్ని సృష్టిస్తాయని యూకే రవాణా శాఖ మంత్రి క్లెయిర్ ఫెర్రీ విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News