: కడప జిల్లా రైల్వేకోడూరు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్
కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని బాలపల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. అడవిలోకి కూంబింగ్ ఆపరేషన్ నిమిత్తం పోలీసుల పైకి స్మగ్లర్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో తమిళనాడుకు చెందిన ఓ ఎర్రచందనం కూలీ మరణించాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నా... స్మగ్లింగ్ మాత్రం యథేచ్చగా సాగడం గమనార్హం.