: తెలంగాణలో సామాజిక సర్వే ఒక్కరోజే... అందరూ పాల్గొనాల్సిందే!
తెలంగాణ రాష్ట్రంలో పౌరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారం కోసం సర్వే చేయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. హైదరాబాదులో అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన కేసీఆర్, సర్వే ఒకే రోజు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించాలని ఆదేశించారు. సర్వేలోని అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలు అమలు చేయనున్నారని సమాచారం. సర్వే రోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.