: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు రాఫ్ట్ర ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. అపార్ట్ డైరెక్టర్ గా రేమండ్ పీటర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లాకు కొత్త కలెక్టరుగా ప్రియదర్శిని, ఖమ్మం జిల్లా కొత్త కలెక్టరుగా ఇలంబర్తి, నిజామాబాద్ జిల్లా కలెక్టరుగా రొనార్డ్ రాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టరుగా జె. నివాస్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టరుగా ప్రీతి మీనా, వికారాబాద్ సబ్ కలెక్టరుగా హరినారాయణ్ ను నియమించారు. నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టరుగా డి.వెంకటేశ్వరరావు బదిలీ అయ్యారు.