: పర్మిట్ ట్యాక్స్ విధింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలు పర్మిట్ ట్యాక్స్ చెల్లించాలంటూ టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రైవేటు రవాణా సంఘం వేసిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం... రవాణా పన్నుపై జీవో నంబర్ 43కు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని సూచించింది. దానిని ఇరు రాష్ట్రాలు గౌరవించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో తాత్కాలిక పర్మిట్ ట్యాక్స్ విధించకూడదని చెప్పింది. మార్చి 31, 2015 వరకు జీవో అమల్లో ఉంటుందని ధర్మాసనం తెలిపింది.