: నగ్నంగా తయారై మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుంది


దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ లో నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా విగ్రహం వద్ద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మండేలా స్క్వేర్ వద్దకు వచ్చి హఠాత్తుగా బట్టలిప్పేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళి మండేలా విగ్రహాన్ని కౌగిలించుకుని ఆయనను లాలిస్తున్నట్టుగా కాసేపు ప్రవర్తించింది. దీంతో అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇదంతా కూడా పక్కనే ఉన్న రెస్టారెంటులోంచి ఓ వెయిట్రెస్ గమనించిందట. ఆ విషయాన్ని ఆమె ఓ వార్తాపత్రికతో పంచుకుంది. అమ్మడు దుస్తులిప్పగానే... రెస్టారెంటులో పురుష వెయిటర్లు న్యూడ్ గొడవలో పడి ఏవేవో ఆర్డర్లు తీసుకున్నారట..! నగ్నసుందరికేసి కళ్ళప్పగించి చూస్తున్న ఓ కస్టమర్ ను అతడి భార్య ఒక్కటిచ్చుకుందట..! ఈ సంఘటనపై నెల్సన్ మండేలా స్క్వేర్ మార్కెటింగ్ మేనేజర్ మేగాన్ మియాస్ మాట్లాడుతూ, ఇక్కడి సెక్యూరిటీ గార్డు బట్టలేసుకోవాల్సిందిగా ఆమెను హెచ్చరించాడని, అయితే, ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు.

  • Loading...

More Telugu News