: స్టాలిన్ పై సీఎం జయలలిత పరువు నష్టం దావా


డీఎంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పై ముఖ్యమంత్రి జయలలిత పరువు నష్టం దావా కేసు వేశారు. ఆమె తరపున చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సిటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ ఈ కేసు దాఖలు చేశారు. అసెంబ్లీ వెలుపల జయపైన, స్పీకర్ పైన వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ కేసు పెట్టారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్టాలిన్ సహా కొంతమంది డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు పంపారు. అప్పుడే అసెంబ్లీ బయట మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, జయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News