: సరస్సులో ఉండాల్సింది బాత్రూంలోకొచ్చింది!


నీటిలో ఉండాల్సిన మొసలి బాత్రూంలోకొచ్చిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో భరత్ పటేల్ అనే వ్యక్తి నివాసంలోకి మొసలి చొరబడింది. బాత్రూం తలుపుతీసేసరికి ఐదడుగుల పొడవున్న మొసలి కనిపించింది. దీంతో ఆ కుటుంబం షాక్ గురైంది. వెంటనే బాత్రూంకు తాళం వేసి ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి ఆ మొసలిని బోనులో బంధించారు. అనంతరం దానిని అక్కడి నుంచి తరలించి అదే జిల్లాలోని మలాతాజ్ గ్రామ సమీపంలోని సరస్సులో వదిలేశారు.

  • Loading...

More Telugu News