: పదహారు మంది మాజీ మంత్రులకు రూ.21 లక్షల జరిమానా


ఎలాంటి సమాచారం లేకుండా యూపీఏకు చెందిన పదహారు మంది మాజీ మంత్రులు ప్రభుత్వ బంగ్లాల్లో నెల రోజులకు పైగా ఉంటున్నారని... ఈ నేపథ్యంలో వారికి నోటీసులు పంపినట్లు కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభలో తెలిపింది. ఇందుకు వారికి రూ.21 లక్షల జరిమానా విధించినట్లు మంత్రి వెంకయ్యనాయుడు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పదిహేను రోజుల్లోగా బంగ్లాను ఖాళీ చేయాలని వారికి తెలిపినట్లు ఆయన చెప్పారు. నోటీసులు అందుకున్న వారిలో జైపాల్ రెడ్డి, సచిన్ పైలట్, ఫరూక్ అబ్దుల్లా, కపిల్ సిబాల్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News