: మరో 20 రోజుల్లో శివరామకృష్ణన్ కమిటీ నివేదిక: ఏపీ మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ మరో 20 రోజుల్లో నివేదిక ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు. అనంతపురం జిల్లాలో ఆయన మాట్లాడుతూ... రాజధానిలో 192 కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాటి కోసం ఇప్పటికే 600 ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అయితే, ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కమిటీ నిర్ణయిస్తుందని నారాయణ తెలిపారు.