: మీకు ఇబ్బందైతే కోర్టుకి వెళ్లండి...మహిళల్ని వేధిస్తే ఊరుకోం: గోవా సీఎం
గోవాలో ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. గోవా అసెంబ్లీలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అశ్లీలత మాటున ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహిళల దుస్తుల విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కేసు నమోదు చేసి కోర్టుకు వెళ్లాలి తప్ప... అశ్లీలత, అభ్యంతరకర చర్యలు చేపడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో గోవా మంత్రి సుదీన్ దావాల్కర్ బికినీలు, మినీ స్కర్టులను నిషేధించాలని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఓ ఎమ్మెల్యే ప్రశ్నించారు.